గుత్తి లోని ఎస్సీ కాలనీకి చెందిన కార్తీక్ (15) అనే బాలుడు వినాయక మండపాల వద్ద గురువారం రాత్రంతా జాగరణ చేశాడు. తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. ఉన్న ఫలంగా కుప్పకూలి కిందపడ్డాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి వైద్యం అందించారు. ఐదు గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని బాలుని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.