స్థానిక సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు ఎండగట్టాలని,ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం అవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు.జనగామ సిపిఎం కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్థానిక MLAలు,MPలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాకాలంతో రోడ్లన్ని గుంతలుగా మారి అనేక ప్రమాదాలకు గురవుతున్నారని,చిన్న పిల్లలు స్కూలుకు వెళుతున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.