ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు బాధితులు వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.