కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సూపర్ హిట్ గా పరిపాలన చేస్తుందని జమ్మలమడుగు టిడిపి నియోజవర్గ ఇన్చార్జి భూపేష్ రెడ్డి కొనియాడారు. శ్రీ శక్తి పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నియోజకవర్గంలోని మహిళలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి కూరగాయల మార్కెట్, మెయిన్ బజార్ మీదుగా పలగాడి సెంటర్ కు ర్యాలీ చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు మాట్లాడారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు.