ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రఫీ మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు వారికి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. వడ్డీ లేని రుణాలను ఆటో కార్మికులకు ఇవ్వాలని కోరారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలన్నారు.