కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో రాత్రి రోడ్డుపై మద్యం తాగి న్యూసెన్స్ చేసిన ఇద్దరినీ శనివారం బైండ్ ఓవర్ చేసినట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మోహన్, అర్జున్ అను ఇద్దరు వ్యక్తులు బొమ్మకల్ శివారు ప్రాంతంలో అర్ధరాత్రి మద్యం తాగి దారి వెంబడి పోయే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గుర్తించి పట్టుకొని, మరొకసారి ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ముందస్తుగా లక్ష రూపాయల సొంత పూచికతపై తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.