Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విషజ్వరాల వ్యాప్తి సమాచారంతో పాఠశాలను నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ సందర్శించారు. విద్యార్థులకు జ్వర సమాచారంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు వచ్చి పాఠశాలను, హాస్టల్ ను పరిశీలించారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది, గురుకుల పాఠశాల సిబ్బందితో విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట డిఎస్పి వేణుగోపాల్, తదితరులు ఉన్నారు.