యాదాద్రి భువనగిరి జిల్లా: రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి ఇబ్బందులు కలకుండా చూడాలని సిపిఎం పోచంపల్లి మండల కార్యదర్శి కోట రామచంద్ర రెడ్డి శనివారం అన్నారు. బుధవారం పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల వ్యవసాయ కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు అనంతరం మండల వ్యవసాయ అధికారి శైలజకు వినతి పత్రాన్ని అందజేశారు. రైతాంగానికి సకాలంలో యూరియాను అందించి రైతులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.