వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలో అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా కొనసాగుతుందని మంగళవారం ప్రజాసంఘాల నాయకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు కొత్తూరు చంద్రయ్య మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల పేరిట మండలంలో రెండు ట్రాక్టర్లకు పర్మిషన్ తీసుకొని 100 ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి వెంటనే అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.