కూకట్పల్లిలోని రంగధాముని చెరువులో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఆదివారం వరకు చిన్న పెద్ద తేడా లేకుండా 661 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జనానికి కదిలి వస్తున్న గణనాధులకు అన్ని శాఖల సిబ్బంది స్వాగతం పలుకుతూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.