అనుమానస్పదంగా మహిళా మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శనివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మాదారం గ్రామంలో పద్మమ్మ అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామంలో స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.