Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 6, 2025
నాగారంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని నాగారం గ్రామానికి చెందిన బెల్లంకొండ రమేష్ అనే వ్యక్తి ఇల్లు బుధవారం ఉదయం 9:30 సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది తడకలతో ఏర్పాటు చేసుకున్న ఇంటికి షార్ట్ సర్క్యూట్ తలెత్తి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు కుటుంబ సభ్యులు వెల్లడించారు కాగా మంటలు చేరేగి ఇంట్లోని వస్తువులు నిత్యవసర వస్తువులు దుస్తులు సర్టిఫికెట్లు డబ్బులు పూర్తిస్థాయిలో కాలి బూడిద అయినట్లు బాధిత వ్యక్తి రమేష్ వెల్లడించారు కూలినాలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.