అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో దిశా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అరకు ఎంపీ చెట్టి తనుజరాని, ఎమ్మెల్యేలు రేగం మత్యలింగం , మత్స్యరాస విశ్వేశ్వర రాజులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన అధికారులను దిశా చట్టం ద్వారా అమలవుతున్న చట్టాలను సమస్యల పరిష్కారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత సమీక్ష సమావేశంలో వచ్చిన ఫిర్యాదులను సత్వర పరిష్కార మార్గాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎంపీ ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకున్నారు.