కాకినాడ జిల్లా కోటనందూరు తుని రౌతులపూడి ప్రాంతాలలో అంగన్వాడీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ వారు కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపి స్థానిక అధికారులకు వినతిపత్రం అందించారు. ప్రధానంగా వేతనాలు పెంచాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని తదితర విషయాలు వారు అధికారులకు తెలిపారు