నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డ్ లో ప్రతి శనివారం నిర్వహించే పశువుల సంతకు నంద్యాల పరిసర ప్రాంతాల నుండే కాక ఇతర జిల్లాల నుండి రైతులు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి పశువుల క్రయ విక్రయాలు సాగిస్తూ ఉంటారు,ఈ సందర్భంగా వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు వసూళ్లకు తెరలేపారు పశువులు కొనుగోలు చేసిన ప్రజలకు తీసుకువెళ్లేటప్పుడు గేట్ దగ్గర వందరూపాయలు చెల్లించి రశీదు తీసుకోవాలి కానీ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సగానికి పైగా రసీదు ఇవ్వకుండా 100 రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్న మార్కెట