ఈనెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేటాయించిన భీమవరం మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలిస్తున్నామని సీపీఎం జిల్లా నాయకుడు గోపాలన్ అన్నారు. శుక్రవారం సాయంకాలం 5 గంటలకు భీమవరం సీపీఎం కార్యాలయంలో జరిగిన వామపక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొంతకాలంగా కలెక్టరేట్ పై గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, గతంలో వచ్చిన జీవో ప్రకారం భీమవరం మార్కెట్ యార్డులోనే కలెక్టర్ ఉండాలని వామపక్షాలు భావిస్తున్నాయని అన్నారు.