ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మంగళవారం పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహమ్మద్ బాషా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించి ఎరువుల కొరత లేకుండా చూడాలని దుకాణదారులను ఆదేశించారు. కృత్రిమంగా ఎరువులు కొరత సృష్టిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ అధికారి దుకాణా దారులను హెచ్చరించారు. అలానే రైతుల కొనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణా దారులకు సూచించారు.