Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
తెలంగాణ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవాహం ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాలుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున వరద తో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం లో జ్ఞాన సరస్వతి, సాధారణ పుష్కర ఘాట్ల మెట్ల పై నుంచి వరద ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ల పై గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12,370 మీటర్ల మేర నీటి మట్టం