రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఎల్బీనగర్ వనస్థలిపురం హయత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా నేషనల్ హైవేపై నీరు చేరడంతో రెండు వైపులా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హయత్ నగర్ హైవే బావర్చి యూటర్న్ వద్ద సమస్య మరింత ఎక్కువగా ఉంది. గతంలో వర్షం పడితే భాగ్యలత ఆర్టీసీ కాలనీ వద్ద ప్రజలు వనికి పోయే పరిస్థితిని గుర్తు చేస్తుంది. నూతన రోడ్డు విషక పరిస్థితి మారడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.