అక్రమాలు సరిదిద్దుకునేందుకు ఎల్ఆర్ఎస్ అద్భుత అవకాశం అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. రియల్టర్లతో పాటు ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని,ప్రజలకు వసతులు కల్పించాలని ఆదేశించారు. వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) అవగాహన సమావేశంలో అయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 1391 ఎకరాల్లో 138 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని నుడా అధికారులు తేల్చారని ఎమ్మెల్యే వెల్లడించారు.