ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురుకి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు లబ్దిదారులకు అందజేసారు. శుక్రవారం ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 31మంది లబ్దిదారులకు, వారి కుటుంబాలకు మంజూరు అయినా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుంచి మంజూరయిన అమౌంట్ అధిక ఖర్చులతో వైద్యం చేయించుకున్న పేదవారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందన్నారు.