శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి సందర్భంగా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. న్యాయవాదిగా, వలసల వ్యతిరేక జాతీయవాదిగా, రాజకీయ నాయకుడిగా, సంఘసంస్కర్తగా ఆయన సమాజానికి ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన సేవలు వెలకట్టలేని నేటి సమాజం ఆయన ఆశయాలను పూర్తిగా తీసుకోవాలన్నారు.