రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం బిజెపి నాయకులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభలో వ్యక్తి ప్రధాని మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.