ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సత్యసాయి బాబా ఆలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో అపోలో ఆసుపత్రుల నుండి వైద్యులు సుమారు 150 మందికి వైద్య పరీక్షలు చేశారని కన్వీనర్ రమేష్ రెడ్డి మనోహర్ రెడ్డి తెలిపారు రోగులకు ఉచితంగా మందులు వినికిడి పరికరాలు అందజేస్తామని అవసరమైన వారికి శస్త్ర చికిత్స ఉచితంగానే చేస్తామని అన్నారు . సత్యసాయి ఆలోచనలైన మానవసేవే మాధవసేవ లో భాగంగా కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలియజేశారు.