చాగలమర్రి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు పండిట్గా పనిచేస్తున్న వి.లక్ష్మయ్య రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా యుడిగా ఎంపికయ్యారు. ఈనెల 5న అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకుంటున్నట్లు చాగలమర్రి మండల విద్యాశాఖ అధికారులు అనురాధ, న్యామతుల్లా తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన లక్ష్మయ్యను పాఠశాల ఉపాధ్యా యులు అభినందించారు.