కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణకు CBIకి అప్పజెప్పడంతో BRS నాయకుల్లో వణుకు మొదలైందని ఎలాగైనా ప్రజలను గందరగోళం లో పడేయాలని డ్రామాలకు తెర లేపారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.మానేర్ డ్యాం నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం జలాలు అంటూ అమరవీరుల స్తూపం పై నీళ్లు చల్లి అమరవీరులను అవమానపరిచారని అందుకే అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేశామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 4గంటలకు నగరం లోని అమరవీరుల స్థూపానికి పాలభిషేకం నిర్వహించారు.