ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎగువనున్న ఎస్సారేస్పి, కడెం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో, అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో జగిత్యాల జిల్లా పరివాహక ప్రాంతంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ఘాట్లపై ఉన్న సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. గోదావరి నది స్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.