బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో దళిత చైతన్య సంఘం అధ్యక్షుడు నవీన్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల అండతో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని తెలిపారు. జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ చైన్ మెన్ అవినీతి కారణంగా అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయని సికింద్రాబాద్ బేగంపేటలో అక్రమాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది చైన్ మెన్ లపై ఫిర్యాదు చేశామని అన్నారు. వారిని బదిలీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.