గూడూరు సబ్ డివిజన్ పరిధిలో జెండా పండుగ, కలిశాలు, వేంకటగిరి జాతరలను దృష్టిలో ఉంచుకుని వందమంది రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామని డీఎస్పీ డాక్టర్ పి. గీతాకుమారి అన్నారు. ఆదివారం గూడూరులో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. జెండా ఉత్సవాలు, కలశాలకు డీజే అనుమతి లేదన్నారు. వినాయక చవితి పండుగ లాగానే జెండా, కలిశాలు, జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యమన్నారు. డీఎస్పీ వెంట సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.