పెడన 16వ వార్డు పరిధిలోని ఓ స్టాక్ పాయింట్ వద్ద అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి వెంకట ప్రసాద్ స్టోర్ చేసిన 4.5 క్వింటల రైస్ను పీడీఎస్ డీటీ మల్లేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మీ గురువారం సీజ్ చేశారు. అనంతరం అతనిపై 6(A) కేసు నమోదు చేసినట్లు తెలిపారు.