స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయ తీలలో పరిశుభ్రత కీటక జనితవ్యాధుల నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం అమలాపురం మండల పరిధిలోని కామనగరువు పేరూరు చింతాడ గరువు రోళ్లపాలెంలలో జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు డిఆర్ఓలు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పరిశీలించారు.