శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అప్పయ్య దొరరోడ్ లో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన దారునికి గాయాలయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం అధిక సంఖ్యలో స్థానికులు గుమి గూడడంతో ఆ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.