కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం కాలేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ చిన్న శంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆమె జలాభిషేకం నిర్వహించారు తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పద్మాదేవేందర్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు