బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు కామారెడ్డి జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు బాన్సువాడ మాజీ జెడ్పిటిసి దుద్దాల అంజిరెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన అనుచరులు అందరూ ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా సోమవారం కామారెడ్డి జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి కేటీఆర్ ను కలిసి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలిసింది.