తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అలంపూర్ పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే విజేయుడు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం,భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.