ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ కారణంగా ఉత్తర కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి మరియు కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. అల్లూరి, ఏలూరు జిల్లాలకు రేపు, ఎల్లుండి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.