ఆర్ హెచ్ కాలనీలో చెట్టుకి ఉరివేసుకుని ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శనివారం ఆర్ హెచ్ కాలనీలో ప్రకాష్ రావు (46) చెట్టుకి చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందాడు. కుమారుడు మృతి చెందడంపై మానసికంగా బాధపడుతూ మధ్యానికి బానిసయ్యి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ప్రకాష్ రావు భార్య పార్వతి పీఎంపాలెం పోలీసులకు తెలిపారు. పీఎంపాలెం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.