చిత్తూరు మండలంలోని గ్రామపంచాయతీల సుస్థిర అభివృద్ధి లక్ష్యమని చిత్తూరు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గ్రామపంచాయతీల సుస్థిర అభివృద్ధిపై సర్పంచులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ పూర్తి చేస్తామన్నారు. శిక్షణ పొందిన అధికారులు గ్రామస్థాయిలో సుస్థిర అభివృద్ధికి చేపట్టవలసిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు పంచాయతీల అభివృద్ధికి ప్రజల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు