ప్రకాశం జిల్లా ఒంగోలులో కొంతమంది జనసేన నాయకుల అసభ్యకరమైన వీడియోలు గురువారం సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారాయి. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియోలు వైరల్ మారడంతో పలువురు విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ, ఈ సంఘటనపై అధిష్టానం విచారణ జరుగుతోందని జనసేన నాయకులు సరదాగా మాట్లాడుకుంటుండగా వీడియోలు తీసుకున్నారని ఆ వీడియోలో నిరసన నాయకులే ఉన్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో కావాలనే ఇలా చేశారని జిల్లా అధ్యక్షుడు తెలిపారు.