నంద్యాల జిల్లా అవుకు మండలం చిన్నచెరువు రిజర్వాయర్లో ఆదివారం గుర్తుతెలియని పురుషుడి మృతదేహం కలకలం రేపింది. కాలువ ద్వారా నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఎగువ నుంచి మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు, ఎస్ఆర్బీసీ అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.