భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా రాయదుర్గం మాజీ శాసనసభ్యులు కాపురామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాదవ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో రామచంద్రారెడ్డి కి కీలక ఉపాధ్యక్ష పదవి వరించింది. వైఎస్సార్సీపీ పార్టీ తరుపున రాయదుర్గం ఎమ్మెల్యే గా మూడు పర్యాయాలు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో వైసిపి కి గుడ్ బయ్ చెప్పి బిజెపి లో చేరిన విషయం తెలిసిందే. హర్ ఘర్ తిరంగ సహా వివిధ కార్యక్రమాలలను బుజాన వేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి విజయవంతం చేశారు.