అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన చామకూరి శ్రీధర్ బదిలీ అయ్యారు. నిశాంత్ కుమార్ గతంలో ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టరుగా సేవలందించారు.కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, శ్రీధర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాల అమలులో విశేష కృషి చేశారు. అయితే ఆయనను ఎక్కడికి బదిలీ చేశారో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.