సూర్యాపేట జిల్లాలోని వర్షాకాలంలో పశువులకు సీజనల్ వ్యాధులు శోకకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలను తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లోని ఖనిజ లవణం మిశ్రమం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోదాడ పశు వైద్యశాలలోని ఔషధ బ్యాంకు నిర్వహణను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.