రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారికి నెలకు 30000 రాబడి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సిరియాల హరే రామ్ అనే ఆటో డ్రైవర్ గాజువాక నుండి అమరావతికి సైకిల్ మీద వెళ్లి చంద్రబాబు నాయుడుకు తమ గోడు వినిపిస్తానని బయలుదేరి వెళ్లాడు. గాజువాక కుంచుమాంబ నుండి ఈ యాత్రను కొనసాగించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 6,60,000 మంది ఆటో కార్మికులు ఉన్నారని వారికి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయారని దీన్ని దృష్టిలో పెట్టుకొని సైకిల్ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలియ చేసాడు. ఆట