ఖమ్మం జిల్లా,వైరా మున్సిపాలిటీ లీలా సుందరయ్య నగర్ లో సాయి గజానన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళా భక్తులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణపతి విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను 11 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు నైవేద్యాలు సమర్పించడం జరిగిందని తెలిపారు స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు.