హై లెవెల్ వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కొణిజర్ల పల్లిపాడు ఏన్కూర్ ప్రధాన రహదారి లాలాపురం తీగల బంజర మధ్య ఉన్న పగిడేరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని సిపిఎం తీగల బంజర, సింగరాయపాలెం గ్రామ శాఖల ఆధ్వర్యంలో రోడ్డుపై ప్రవహిస్తున్న వాగు వరదలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు, టిఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలిపారు, సంవత్సరానికి నాలుగు నెలల పాటు వర్షాకాలం వాగుపై వరదలు రావడంతో వేలాది మంది ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం గ్రామ మండల నాయకులు కట్టా రాంబాబు, షేక్ అఫ్జల్ ఆవేదన వ్యక్తం చేశారు.