కట్టే జనుము పంట అగ్నికి ఆహుతి నరసన్నపేటలోని ఉర్లాం వద్ద మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడున్నర ఎకరాల కట్టె జనుము పంట కాలి బూడిదయ్యింది. బడ్డవాని పేట గ్రామానికి చెందిన రైతు పండి కృష్ణారావు తన పంట పొలంలో కట్టెజనుము సాగు చేపట్టాడు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీలతో పొలం వద్దకు వచ్చిన సమయంలో పంట కాలిపోతుండటంతో జీర్ణించుకోలేకపోయారు. చేతికి అందివచ్చిన పంట బూడిదై రూ. లక్ష మేరా నష్టపోయినట్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.