Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, నాగులపాడులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంపై సలహాలు, సూచనలు తెలియజేశారు. రసాయనాలు అధికంగా వాడవద్దని ఇలా చేస్తే నేల, ప్రకృతి కలుషితమవుతాయని తెలియజేశారు. ప్రభుత్వ పరంగా రైతులకు అందిస్తున్న రాయితీలు, పథకాలను వివరించారు.