పెంచికల్పేట్ మండలంలోని బొంబాయి గూడా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొంబాయి గూడా గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎర్రగుంట కు చెందిన వ్యక్తి వెళ్తున్న క్రమంలో వెనుక నుండి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపడుతున్నారు,