కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువై ఉన్న జై గణేశ స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో 3వ రోజు శుక్రవారం ఉదయం నుంచి జై గణేశ స్వామి వారు చందన అలంకారంలో దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి సహస్రనామ పూజలు నిర్వహించి పంచ హారతులు సమర్పించారు. భక్తులు జై గణేష్ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.